కోహెడ, వెలుగు : మండలంలోని బస్వాపూర్ శివారులో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ డిపోకు చెందిన బస్సు సిద్దిపేట నుంచి హన్మకొండకు వెళ్తోంది. బస్వాపూర్ శివారులో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కకి వెళ్లి వన్సైడ్కు ఒరిగింది.
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్నుంచి బయటకు దిగారు. రోడ్డు పనుల ఆలస్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీసం సూచికలు సైతం ఏర్పాటు చేయడంలేదని వాపోయారు.